మహిళా శక్తితో అద్భుత ఫలితాలు
కాకతీయ, గజ్వేల్ : మహిళలు తలుచుకుంటే అద్భుత ఫలితాలు సాధిస్తారని కావేరి యూనివర్సిటీ వీసీ డాక్టర్ ప్రవీణ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారంలోని కావేరి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శక్తి నేషనల్ లీడర్‌షిప్ కాంక్లేవ్ 2026 ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులలో స్ఫూర్తిని నింపేందుకు ప్రముఖ మహిళా సాధకులను ఒకే వేదికపైకి తేగా, ఉపన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ సెషన్ల ద్వారా మహిళా నాయకత్వం, ఆత్మస్థైర్యం, సమాజానికి వారు చేసిన సేవలు పేర్కొంటూ స్ఫూర్తిని నింపారు. విద్య, ఉపాధి, నాయకత్వంలో వారికి సమాన అవకాశాలు దక్కితేనె సమాజాభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ఆభాస రిహాబ్ సెంటర్ డైరెక్టర్ గాయత్రి అరవింద్, ఎస్ఎంఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మంజుల రావు, ఐసిఏఆర్ రిటైర్డ్ ప్రిన్సిపాల్, శాస్త్రవేత్త కెబిఆర్ఎస్ విశారద, గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత సోఫియా సూఫీ, స్ట్రాటజీ, బిజినెస్ మాజీ సీఈఓ వైశాలి నియోజియా, క్లాసికల్ డ్యాన్సర్, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ గ్రహీత విదూషి దీక్షను వీసీ డాక్టర్ ప్రవీణ్ రావు సత్కరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీనివాసులు, డైరెక్టర్ హర్ష పోలసాని, డీన్స్ డాక్టర్ కొండ శ్రీనివాస్, డాక్టర్ ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


