epaper
Monday, March 9, 2026
epaper

ఎన్టీపీసీకి స్వేచ్ఛ ఇవ్వాలి

ఎన్టీపీసీకి స్వేచ్ఛ ఇవ్వాలి

తెలంగాణ ప్ర‌భుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలి

ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవాలి

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి విజ్ఞప్తి

రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టుపై లేఖ

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 3×800 మెగావాట్ల సామర్థ్యంతో 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకోవాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికు లేఖ రాశారు. రామగుండంలో మొత్తం 5,800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గు సమీకరణలో ఎన్టీపీసీకి తగిన స్వేచ్ఛ ఇవ్వాలని కూడా కోరారు. రామగుండంలో ఏర్పాటు చేయనున్న 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టులో తొలి దశగా రూ.12,000 కోట్ల వ్యయంతో అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతికతతో నిర్మించిన 2×800 మెగావాట్ల (1,600 మెగావాట్ల) రెండు యూనిట్లను 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేసిన విషయం గుర్తు చేశారు.

విద్యుత్ డిమాండ్ పెరుగుదలపై ఆందోళన

తొలి దశ అనంతరం రెండో దశలో భాగంగా 3×800 మెగావాట్ల సామర్థ్యంతో మిగిలిన మూడు యూనిట్లను పూర్తి చేయడానికి ఎన్టీపీసీ చర్యలు చేపట్టిందని లేఖలో పేర్కొన్నారు. మొదటి దశలోలాగే రెండో దశలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 85 శాతం తెలంగాణ రాష్ట్రానికే సరఫరా చేయనున్నట్లు తెలిపారు. 2026 మార్చి 3న తెలంగాణలో ఇప్పటివరకు లేనివిధంగా 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైందని రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ రంగంపై ఇచ్చిన ప్రదర్శనలో గ్రిడ్ స్థిరత్వం కోసం రాష్ట్రంలో 5,000 నుంచి 6,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెంపు అవసరం ఉందని తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే 2047 నాటికి రాష్ట్రంలో లక్ష మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండొచ్చని కూడా పేర్కొన్నారని తెలిపారు. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు కూడా లేఖలో ప్రస్తావించారు.

ఎన్టీపీసీ అనుభవం, పీపీఏ అవసరం

అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతికతతో తక్కువ ఖర్చులో నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి చేయడంలో ఎన్టీపీసీకి విశేష అనుభవం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. గతంలో రాష్ట్ర శాసనసభలో విద్యుత్ రంగంపై జరిగిన చర్చలో భాగంగా రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రశంసించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. పూర్తి 5,800 మెగావాట్ల ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గు సమీకరణలో ఎన్టీపీసీకి స్వేచ్ఛ ఇస్తే తక్కువ ధరకే నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి చేసి తెలంగాణ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ఎన్టీపీసీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే ఇతర దక్షిణాది రాష్ట్రాలు కూడా ఎన్టీపీసీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. అందువల్ల రామగుండం రెండో దశ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం పీపీఏ కుదుర్చుకునేలా మీరు వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని, ఈ ప్రాజెక్టుకు సహకరించాలని కిషన్ రెడ్డి తన లేఖలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆగ‌ని ఇసుక అక్రమ రవాణా

ఆగ‌ని ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్లు, గూడ్స్ వాహనాల్లో త‌ర‌లింపు పోలీసులల‌ దాడులు.. నలుగురిపై...

ప్రగతిలో ముందుండాలి

ప్రగతిలో ముందుండాలి తాగునీటి సమస్యపై ముందస్తు చర్యలు తీసుకోవాలి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం...

పీఎం సూర్య ఘర్ ను స‌ద్వినియోగం చేసుకోవాలి

పీఎం సూర్య ఘర్ ను స‌ద్వినియోగం చేసుకోవాలి ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్...

గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు

గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు ధర్మపురి క్షేత్రానికి రాష్ట్రస్థాయి గుర్తింపు రావాలి మంత్రి అడ్లూరి...

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు జ‌గిత్యాల జిల్లాలో 590...

పండుగలకు నిధులు కేటాయించాలి

పండుగలకు నిధులు కేటాయించాలి కాకతీయ, హుజూరాబాద్ : హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో జరిగే...

బైకు కొనివ్వలేదని విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య

బైకు కొనివ్వలేదని విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య కాకతీయ, కరీంనగర్ రూరల్...

జల్ జీవన్ మిషన్‌పై గ్రామ సభ

జల్ జీవన్ మిషన్‌పై గ్రామ సభ నల్లవెంకాయపల్లిలో అవగాహన కార్యక్రమం కాకతీయ, శంకరపట్నం: జల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img