epaper
Monday, March 9, 2026
epaper

విన్నపాలు విడిచి

విన్నపాలు విడిచి
పన్నుల వేట!

వెలవెలబోయిన జీడబ్ల్యూఎంసీ గ్రీవెన్స్ ..
పూర్తిస్థాయిలో హాజరుకాని అధికారులు
ఆఫీస‌ర్ల తీరుపై బాధితుల ఆగ్ర‌హం

కాకతీయ, వరంగల్: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే నిర్వహిస్తున్నామంటున్న గ్రీవెన్స్ సెల్ సోమవారం వరంగల్ మహానగర పాలక సంస్థలో వెలవెలబోయింది. తమ గోడు వెళ్లబోసుకునేందుకు ప్రజలు తరలివచ్చినా.. అధికారులు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకాకపోవడంతో నిరాశకు లోనయ్యారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్ తోపాటు మరో అధికారీ మాత్రమే గ్రీవెన్స్ సెల్ కు హాజరయ్యారు. అయితే, మార్చి నెల.. ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో చాలామంది అధికారులు పన్నుల వేటలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గ్రీవెన్స్ సెల్స్ ను విస్మరించి.. పన్నుల వసూళ్లకే ప్రాధాన్యం ఇవ్వడం పట్ల గ్రీవెన్స్ సందర్శకుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజల సమస్యలను గాలికొదిలేసి.. పన్నుల కోసం అధికారులు గైర్హాజర్ కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇక గ్రీవెన్స్‌కు మొత్తం 53 అర్జీలు రాగా, టౌన్లానింగ్ విభాగానికి 21, ఇంజనీరింగ్ 16, రెవెన్యూ 4, హెల్త్ అండ్ శానిటేషన్ 7, నీటి సరఫరా 4, హార్టికల్చర్ విభాగానికి 1 వినతులు అందాయి. కార్యక్రమంలో ఇంచార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, తదితరులు పాల్గొన్నారు.

వినతుల వివరాలిలా..

ఉర్సు కుమ్మరివాడ శివారులో శ్మశానవాటికకు వెళ్లే సీసీ రోడ్డును కొందరు జేసీబీతో ధ్వంసం చేసినట్లు స్థానికులు గ్రీవెన్స్ కు ఫిర్యాదు చేశారు. బాధ్యులైన వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

27వ డివిజన్ దళితకాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు అర్ధంతరంగా రద్దు కావడాన్ని ఆక్షేపిస్తూ స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్కుమార్ బల్దియా గ్రీవెన్స్ ను ఆశ్రయించారు. పనులపై అగ్రిమెంట్ జరిగాక, రద్దు కావడం ఏమిటని ప్రశ్నించారు. అందుకు గల కారణాలు, కారకులు ఎవరనే విషయంపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

భూ కబ్జా, అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి

దేశాయిపేట ఏరియా సర్వేనంబర్ 299లో గల తన 20 గుంటల పట్టా భూమిని కొందరు ఆక్రమించి, అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని జన్ను నూతన్ బల్దియా అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ విషయమై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి, తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

సొసైటీ స్థలం కబ్జా

కాశీబుగ్గ ఏరియాలోని బ్రిక్స్ అండ్ టైల్స్ కో ఆపరేషన్ సొసైటీ స్థలాన్ని కొందరు అక్రమంగా కబ్జా చేయడమే కాకుండా నిర్మాణాలు చేపడుతున్నారని సొసైటీ బాధ్యులు డాక్టర్ సముద్రాల లక్ష్మీనారాయణ విన్నవించారు. గతంలో కొందరు కబ్జా చేస్తుంటే కోర్టుకెళ్లగా, ఆ స్థలం సొసైటీదేననే న్యాయస్థానం తేల్చిందని, అయినా, వెలిశాల మల్లికాంబ పేరిట కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని మళ్లీ ఆక్రమించుకుంటున్నారని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి సొసైటీ స్థలాన్ని పరిరక్షించాలని గ్రీవెన్సెసెల్లో వినతిపత్రం సమర్పించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల గుడి వద్ద యువకులపై దాడి..

కొమ్మాల గుడి వద్ద యువకులపై దాడి.. నిందితుడిపై కేసు నమోదు కాకతీయ,గీసుగొండ:కొమ్మాల గుడి...

పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు

పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు శంక‌రా నేత్ర వైద్య‌శాల‌, రుద్ర ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో...

25 శాతం ఫెనాల్టీ మాఫీ చేయాలి

25 శాతం ఫెనాల్టీ మాఫీ చేయాలి 12 శాతం వడ్డీని ర‌ద్దు చేయాలి ములుగు...

ఆరోగ్యం కోసమే 5 కే రన్

ఆరోగ్యం కోసమే 5 కే రన్ ప్రజల సహకారం, భాగస్వామ్యంతోనే అభివృద్ధి నగర మేయర్...

వేం నరేందర్‌రెడ్డిని కలిసిన బొమ్మినేని

వేం నరేందర్‌రెడ్డిని కలిసిన బొమ్మినేని కాకతీయ, వరంగల్ : రాజ్యసభకు ఎంపికైన వేం...

బీజేపీతోనే నగరాభివృద్ధి

బీజేపీతోనే నగరాభివృద్ధి వరంగల్ అభివృద్ధిపై కేంద్రం నజర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌కి నిధులు కేటాయించడం...

గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిర‌స‌న‌

గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిర‌స‌న‌ కాకతీయ, నర్సంపేట టౌన్: కేంద్ర ప్రభుత్వం...

ఇసుక ర్యాంప్ డీల్‌లో ఎస్సైపై లంచం ఆరోపణలు

ఇసుక ర్యాంప్ డీల్‌లో ఎస్సైపై లంచం ఆరోపణలు ఒక లక్ష రూపాయలు డిమాండ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img