epaper
Monday, March 9, 2026
epaper

బాలికలకు హెచ్‌పీవీ టీకాలు అందించాలి

బాలికలకు హెచ్‌పీవీ టీకాలు అందించాలి
గర్భాశయ క్యాన్సర్ నివారణకు టీకా కీలకం
అర్హులైన బాలికలను గుర్తించి వ్యాక్సినేషన్
జిల్లా ఆసుపత్రులు, సిహెచ్‌సిల్లో టీకాలు
గ్లకోమాపై అవగాహన కార్యక్రమాలు
అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి

కాకతీయ, ఖమ్మం : అర్హులైన బాలికలకు పూర్తి స్థాయిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ అందించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై జిల్లా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. 14 సంవత్సరాలు పూర్తి చేసి 15 సంవత్సరాల లోపు ఉన్న బాలికలకు ఈ టీకా వేయడం ద్వారా గర్భాశయ ముఖ క్యాన్సర్‌ను నివారించే అవకాశం ఉంటుందని అన్నారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కల్లూరు, మధిర, పెనుబల్లి, సత్తుపల్లి, వైరా ఏరియా ఆసుపత్రుల్లో ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వ్యాక్సినేషన్ అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 11,460 మంది బాలికలు ఈ వయస్సు గలవారని అంచనా ఉందని చెప్పారు. బాలికల తల్లిదండ్రులకు టీకా వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించి ఎక్కువ మంది టీకా తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే మార్చి 8 నుంచి మార్చి 14 వరకు గ్లకోమాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

స్టేడియంలో సింథటిక్ ట్రాక్

స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఫ‌లించిన మంత్రి తుమ్మల కృషి రూ.8.50 కోట్లతో నిర్మాణం.. శరవేగంగా...

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించాలి అర్హులకు న్యాయం జరిగేలా బాధ్యతగా...

పోడు భూమిలో కందకాలు..

పోడు భూముల్లో కందకాలు మనస్థాపంతో రైతు ఆత్మహత్యాయత్నం తిప్పగుట్టలో ఉద్రిక్త పరిస్థితి.. అటవీ శాఖ...

మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనాలి

మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనాలికొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి మద్దతు ధర 2400...

ఆడబిడ్డల ఉసురు తగులుతుంది..!

ఆడబిడ్డల ఉసురు తగులుతుంది..! పరీక్షల సమయంలోనే ఇళ్లు కూల్చడం దారుణం బాధితుల బాధను రాజకీయ...

కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు..!

కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు..! కొత్తూరు తండాలో 20 కుటుంబాలు పార్టీ తీర్థం కాకతీయ, కారేపల్లి...

సీఎం రిలీఫ్ ఫండ్‌తో లక్ష సాయం..!

సీఎం రిలీఫ్ ఫండ్‌తో లక్ష సాయం..! అనారోగ్యంతో ఉన్న వార్డు సభ్యుడికి చెక్కు...

గ్యాస్ ధరలు తగ్గించాలని దిష్టిబొమ్మ దహనం..!

గ్యాస్ ధరలు తగ్గించాలని దిష్టిబొమ్మ దహనం..! పి ఓ డబ్ల్యూ ఆధ్వర్యంలో నిరసన కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img