మహిళలను కాంగ్రెస్ మోసం చేసింది..!
హామీల అమలులో పూర్తిగా విఫలం
గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి
కాకతీయ, గజ్వేల్ : మహిళలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బాగుంటేనే కుటుంబం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, చదువుకున్న విద్యార్థినులకు స్కూటీలు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని అన్నారు. అనంతరం ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగ్ రావు, మహిళా కౌన్సిలర్లు, బిఆర్‌ఎస్ మహిళా నాయకురాళ్లకు శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో మాదాసు శ్రీనివాస్, నవాజ్ మీరా, గోలి మమతా సంతోష్, బొగ్గుల స్వప్న సురేష్, మన్నెరూప వెంకటేష్, కప్ప మమత పోచయ్య, కొలిచెల్మి భవానీ కరుణాకర్, కోట బాబు, ఫర్జానా బేగం, రజియా బేగం, గుంటూకు రాజు, రమేష్, అహ్మద్, పాల రమేష్ గౌడ్, హనుమంత్ రెడ్డి, స్వామి చారి తదితరులు పాల్గొన్నారు.


