శ్రీ కంఠ మహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా
బొమ్మకల్ గ్రామంలో భక్తుల కోలాహలం
కాకతీయ, పెద్దవంగర: మండలంలోని బొమ్మకల్ గ్రామంలో నిర్మించిన శ్రీ కంఠ మహేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఆదివారం కనుల పండువగా నిర్వహించారు. వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణ మధ్య జరిగిన ఈ వేడుకలో వివిధ గ్రామాల భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొని స్వామి వారికి పూజలు చేశారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, గ్రామంలో శాంతి, ఐశ్వర్యాలు నెలకొనాలని ప్రార్థించారు. అనంతరం స్థానికంగా జరిగిన వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి పట్టువస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


