కాకతీయ, హనుమకొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదవీవిరమణ చేసిన పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవీ విరమణ అనంతరం అధికారులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. మీరు అందించిన సేవలు నేటి తరం పోలీసులకు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి.
నేటి ప్రశాంత వాతావరణానికి మీ కృషి ప్రధాన కారణం అని సీపీ అన్నారు. ఈ సందర్భంగా పదవీవిరమణ పొందిన ఎస్.ఐలు యాకుబ్ మొహినూద్దీన్, మహమ్మద్ అలీ, రాధే శ్యామ్ శర్మ, యాదగిరి, నందమ చారి, ఏఎస్‌ఐలు జిలాని, సురేందర్, హెడ్ కానిస్టేబుళ్లు ముత్తయ్య, యాకుబ్ పాషా, శ్రీనివాస్ లకు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో అదనపు డిసిపిలు రవి, శ్రీనివాస్, ఏసీపీ సురేంద్ర, ఆర్‌ఐలు సతీష్, స్పర్జన్ రాజ్, శ్రీనివాస్, శ్రీధర్ చంద్రశేఖర్, ఆర్.ఎస్.ఐ శ్రవణ్ తో పాటు రిటైర్డ్ సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో 12 సంవత్సరాలపాటు సేవలందించిన పోలీస్ జాగిలం బ్రోనోకు ప్రత్యేక పదవీవిరమణ కార్యక్రమం నిర్వహించారు. ట్రాకర్ జాగిలంగా గుర్తింపు పొందిన బ్రోనో ఇప్పటివరకు 15 కేసుల్లో నిందితులను గుర్తించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, జాతీయ పోలీస్ డ్యూటీ మీట్లలో పలు పతకాలను కూడా సాధించింది. దీని శిక్షకుడిగా ఏ. హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ వ్యవహరించారు. బ్రోనో సేవలను గుర్తించి పోలీస్ కమిషనర్ ఘనంగా సత్కరించారు.


