epaper
Sunday, March 8, 2026
epaper

వరంగల్‌కు 5257.20 కోట్లు మంజూరు

వరంగల్‌కు 5257.20 కోట్లు మంజూరు
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పథకానికి ప‌రిపాలనా అనుమతి
జీడ‌బ్ల్యూఎంసీ ప‌రిధిలో ప‌నుల‌కు ఊతం
అర్బన్ చాలెంజ్ ఫండ్ ద్వారా నిధుల సమీకరణ
విదేశీ సహాయం, కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిధుల‌తో క‌లిపి కేటాయింపులు
నగర పారిశుధ్యానికి కీలక మౌలిక సదుపాయం
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ

కాకతీయ, వరంగల్ : గ్రేటర్ వరంగల్ నగరంలో సమగ్ర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి మొత్తం 5257.20 కోట్ల వ్యయంతో పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ నగరంలో ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫేజ్-1 కింద ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పథకం చేపట్టనున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ జారీ చేసిన జీవో ఆర్.టి నెంబర్ 322 ప్రకారం ఈ పనులకు 5257.20 కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు శ‌నివారం జారీ అయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా నగరంలో మురుగు నీటి నిర్వహణను పూర్తిగా శాస్త్రీయంగా నిర్వహించడానికి అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం నగరంలో పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న పట్టణ పరిమితులను దృష్టిలో పెట్టుకుని సమగ్ర డ్రైనేజ్ వ్యవస్థ అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.

నిధుల సమీకరణ ఇలా

ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను మూడు వనరుల నుంచి సమీకరించనున్నారు. మొత్తం వ్యయంలో 50 శాతం విదేశీ ఆర్థిక సహాయం రూపంలో రుణంగా పొందనున్నారు. మరో 25 శాతం కేంద్ర ప్రభుత్వం అర్బన్ చాలెంజ్ ఫండ్ ద్వారా అందించనుంది. మిగతా 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటాగా భరించనుంది. జర్మనీకి చెందిన కెఎఫ్‌డబ్ల్యూ అభివృద్ధి సంస్థ ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించేందుకు ఆసక్తి చూపినట్లు అధికారికంగా వెల్లడైంది. ఈ సంస్థ ప్రతినిధులు వరంగల్ నగరాన్ని సందర్శించి ప్రాజెక్టు వివరాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కోసం తయారు చేసిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను కూడా సంబంధిత సంస్థలకు అందజేసినట్లు సమాచారం. ప్రాజెక్టు అమలుకు సంబంధించి ముందస్తు అనుమతి కూడా పొందినట్లు అధికారులు పేర్కొన్నారు.

నగరాభివృద్ధికి కీలక అడుగు

ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు అమలుతో వరంగల్ నగరంలో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. మురుగు నీటి సమస్యలు తగ్గడంతో పాటు ప్రజారోగ్యానికి కూడా ఇది ఉపయోగపడనుంది. నగరంలో వర్షాకాలంలో తరచుగా ఎదురయ్యే మురుగు నీటి సమస్యలకు ఈ ప్రాజెక్టు దీర్ఘకాలిక పరిష్కారం చూపుతుందని అధికారులు తెలిపారు. నగరాభివృద్ధికి ఇది ఒక కీలక అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను రాష్ట్ర గవర్నర్ పేరుతో ప్రభుత్వం జారీ చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి డాక్టర్ టి.కె. శ్రీదేవి ఈ ఉత్తర్వులపై సంతకం చేశారు. ప్రాజెక్టు అమలు కోసం అవసరమైన చర్యలను తీసుకోవాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ మరియు డైరెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు ఇనుగాల ప్ర‌య‌త్నాలు..!

బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు ఇనుగాల ప్ర‌య‌త్నాలు..! అంత‌లోనే అధిష్ఠానం పెద్ద‌ల నుంచి ఫోన్లు కొమ్మాల జాతరకు ర్యాలీగా...

మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం

మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం మంత్రి కొండా సురేఖ ​శివ నగర్‌లో కుట్టు మిషన్ల పంపిణీ 35వ...

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి కాకతీయ, చెన్నారావుపేట: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ...

ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వం

ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వం కాకతీయ, ఏటూరునాగారం : మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ...

అగ్ని ప్ర‌మాదాలపై అవగాహన

అగ్ని ప్ర‌మాదాలపై అవగాహన కాకతీయ, ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీవివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో...

మెమోలు వచ్చినా… “అను”భవం మారాధా..!?

మెమోలు వచ్చినా… “అను”భవం మారాధా..!? కొమ్మాల దేవస్థానంలో మహిళా ఉద్యోగి వింత పోకడలు డ్రెస్...

పట్టణాభివృద్ధే లక్ష్యం

పట్టణాభివృద్ధే లక్ష్యం చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్ కాకతీయ, నర్సంపేట టౌన్: పట్టణాన్ని అన్ని రంగాల్లో...

ప్రభుత్వ పథకాలు

ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరాలి సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి దిశ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img