మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
కాకతీయ, చెన్నారావుపేట: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమాజ అభివృద్ధికి ముందడుగు వేయాలని సిద్ధార్థ విద్యాసంస్థల అధినేత్రి కంది విజయ గోపాల్ రెడ్డి అన్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని సిద్ధార్థ హైస్కూల్‌లో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కంది విజయ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ… మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మహిళ ఒక శక్తి అని, మహిళ లేకుండా ఈ ప్రపంచం లేదని అన్నారు. సమాజంలో మహిళలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వాలు వారి సంక్షేమం కోసం మరిన్ని పథకాలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అండెం కరుణాకర్ రెడ్డి, కుండె రోజారాణి, బొజ్జ స్వప్న, పతకమురి శైలజ, నామాల సృజన, కొండపర్తి దివ్యజ్యోతి, దొంతి స్రవంతి, కాచవరపు సంధ్య, శిరీష, కవిత, లావణ్య, స్వాతి, పద్మ, జ్యోతి, రమాదేవి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.


