epaper
Saturday, November 15, 2025
epaper

రైతుల గోస మంథ‌ని ఎమ్మెల్యే ప‌ట్టించుకోవ‌డం లేదు: మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఫైర్

– యూరియాతో వస్తడనుకుంటే పోలీస్‌ పహారాలో వచ్చిండు
– 40బస్తాల లెక్క చెప్పని అధికారిపై చీటింగ్‌ కేసు పెట్టాలి
– మంథని ఎమ్మెల్యే అండతోనే యూరియా బ్లాక్‌ మార్కెట్‌కు
– పోలీసులు రైతుల పక్షాన నిలబడి న్యాయం చేయాలే
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌

కాక‌తీయ‌, పెద్ద‌ప‌ల్లి: ఒక్క‌ బస్తా యూరియా కోసం రైతులు నానా తంటాలు పడుతుంటే.. రైతుల గోస పట్టించుకోకుండా మంథని ఎమ్మెల్యే మీటింగ్‌ పెట్టి వెళ్లిపోయాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు. శనివారం మంథని పాత పెట్రోల్‌ బంక్‌ సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతుల ఇబ్బందులను తెలుసుకుని రైతు సేవా కేంద్రం నిర్వాహకుడితో మాట్లాడి వివరాల పై ఆరా తీశారు. అయితే సదరు వ్యాపారి బాబురావు గోదాంలో 110బస్తాలు ఉన్నాయని, ఇప్పటికే 40మంది టోకెన్లు తీసుకున్నారని వివరించారు.

ఈ క్రమంలో మిగిలిన వాటి గురించి అడుగగా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వ్యాపారి, వ్యవసాయ అధికారులు, పోలీసుల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ చౌరస్తాలో రైతులతో కలిసి రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంథని ఎమ్మెల్యే శుక్రవారం మంథనికి వస్తున్నాడంటే యూరియా బస్తాలు వస్తాయని అనుకున్నామని, కానీ ఆయన వేల మంది పోలీస్‌ పహారాలో వచ్చి రైతులను కలువకుండా వారి గోస వినకుండా మీటింగ్‌లు పెట్టుకుని వెళ్లిపోయాడని అన్నారు.

మానీఫెస్టో కమిటి చైర్మన్‌గా, మంత్రిగా ఈ ప్రాంత ఎమ్మెల్యేగా రైతులను పట్టించుకోకపోవడంతో రైతులకు దిక్కుగా ఉన్న ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన రైతులకు అండగా నిలిచామన్నారు. రాజ్యాంగాన్ని అనుసరించి తాము సామరస్యంగా రైతు సేవా కేంద్రం నిర్వాహకుడు తో మాట్లాడితే పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడని, 110బస్తాలను 40మంది రైతులకు రెండు చొప్పున ఇస్తామని చెప్తుండగా వ్యవసాయ అధికారి మాత్రం రైతులకు 70బస్తాలు ఇస్తామని చెప్తున్నారని తెలిపారు. అయితే మిగిలిన 40బస్తాల మాటేమిటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదన్నారు.

మిగిలిన బస్తాలను రాత్రికి రాత్రి కాంగ్రెస్‌ నాయకులకు ఇస్తే వాళ్లు బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. మంథని ఎమ్మెల్యే నాయకత్వంలోనే యూరియా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతుందని, కల్వచర్లలో అక్రమంగా తరలిస్తున్న వంద బస్తాలను పట్టుకున్నారని ఆయన తెలిపారు. 40బస్తాలపై సమాధానం చెప్పని వ్యవసాయ అధికారిపై చీటింగ్‌ కేసు పెట్టాలని, సదరు వ్యాపారిపై కేసు పెట్టి విచారణ చేసి అసలు దోషులను బయటకు తీయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతు సేవా కేంద్రంలో జరిగిన వ్యవహారానికి మంథని ఎస్‌ఐ ప్రత్యక్ష సాక్షి అని ఆయన ముందే నిర్థారణ అయిందన్నారు. పోలీసులు సైతం అత్యుత్సాహం చూపుతున్నారని, పోలీసులు రైతుల పక్షాన నిలబడి రైతులకు న్యాయం చేయాలే తప్ప కాంగ్రెస్‌ పార్టీకి వత్తాసు పలుకవద్దని ఆయన హితవు పలికారు. ఇప్పటికైనా ఈ విషయంలో మానీఫెస్టో కమిటి, 420కమిటి చైర్మన్‌ స్పందించాలని, ఈ ప్రాంతల ప్రజల ఓట్లతో 40ఏండ్లుగా అధికారం వచ్చిందనే విషయాన్ని గుర్తించాలన్నారు.

గణపతి బప్పా మోరియా… కావాలయ్య యూరియా!

గణపతిబప్పా మోరియా కావాలయా యూరియా అంటూ పాత పెట్రోల్‌ బంక్‌ చౌరస్తా మార్మోగింది. రైతు సేవా కేంద్రం నిర్వాహకుడు, వ్యవసాయ అధికారుల వైఖరిని నిరసిస్తూ పెద్దపల్లి – కాటారం ప్రధాన రహదారి పాత పెట్రోల్ బంకు చౌరస్తా లో ప్రభుత్వం సరిపడ యూరియా సరఫరా చేయాలనే డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా గణనాథుడి విగ్రహాంతో ధర్నా నిర్వహించారు.

గణపతి బప్పా మోరియా…కావాలయ్య యూరియా అనే నినాదం తో విఘ్నేశ్వర స్వామికి భజన చేసి యూరియా బాధలను తీర్చాలంటూ స్వామివారిని వేడుకున్నారు. ఎరువుల దుకాణాల్లో దళారులకు లింకు పెట్టి అక్రమంగా యూరియా విక్రయిస్తున్నారని రైతులు ఆరోపించారు.చివరకు రైతులకు యూరియా బస్తాలు ఇస్తామంటూ చెప్పడంతో ఆందోళణ విరమించారు. అనంతరం రైతు సేవా కేంద్రం ఎదుట యూరియా కోసం క్యూలైన్‌లో నిలబడిన రైతులకు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ వాటర్‌ బాటిల్స్‌ , బిస్కెట్ ప్యాకెట్స్ అందజేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరుగుతున్న రహదారి...

17 వ మహాసభ జయప్రదం చేయాలి

17 వ మహాసభ జయప్రదం చేయాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : మందమర్రిలో ఈ...

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : ఓపెన్ కాస్ట్ ఫేజ్...

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప...

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్..

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్.. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ బంపర్ "వి"క్టరీ.. సోమాజిగూడ...

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల రఘునాథపాలెం మండలంలో పొలాలు సందర్శించిన మంత్రి...

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌ రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నిర్వహణ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img