కాకతీయ, తెలంగాణ బ్యూరో: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అజహరుద్దీన్ లను మంత్రి వర్గం ఖరారు చేసింది. శనివారం జరిగిన మంత్రివర్గ భేటీలో వీరిద్దరి పేర్లకు ఆమోదం తెలిపింది. గతంలో ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే వీరిద్దరి నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇప్పుడు తాజాగా అమీర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్ కు అవకాశం కల్పించారు.
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున టికెట్ ఆశిస్తున్న అజారుద్దీన్ పేరును అనూహ్యంగా ఎమ్మెల్సీగా ప్రకటించడంతో జూబ్లిహిల్స్ టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.


