ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
కాకతీయ, కొత్తగూడెం :జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెం నందు శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు గ్రంథాలయ కార్యదర్శి కే .కరణ కుమారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొల్లు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కల్పనా చౌదరి పాల్గొని అన్నారు. మహిళలు నేడు అనేక రంగాలలో ముందంజలో ఉన్నారని ఇంకా మహిళలు అన్ని విధాల అన్ని రంగాలలోఉన్నత స్థానంలో ఉండాలని అప్పుడే సమాజాభివృద్ధి కుటుంబా అభివృద్ధి జరుగుతుందని వివరించారు ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి మహిళా ఉద్యోగులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమాల్లో గ్రంథాలయ కార్యదర్శి కే కరణకుమారి ఆఫీస్ ఇన్చార్జి ఎం నవీన్ కుమార్ గ్రంథా పాలకురాలు జీ.మణిమృదుల గ్రంథ పాలకులు వాణి రుక్మిణి గీత విద్యార్థినీ విద్యార్థులు పాఠకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


