విద్యార్థుల అల్పాహారంలో నాణ్యత పాటించాలి
కాకతీయ, పెద్దవంగర : విద్యార్థులకు అందించే అల్పాహారంలో నాణ్యత పాటించాలని ఆర్ బిఎస్ కె టీం వారు కేజీబివి ఉపాధ్యాయులకు, సిబ్బందికి సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యక్రమంలో భాగంగా పెద్దవంగర మండలంలోని కేజీబివి పాఠశాల విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించి మాట్లాడారు. విద్యార్థులు మానసిక ఒత్తిడి, వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికహారం, రక్తహీనత, పరిశుభ్రతతోపాటు ప్రతిరోజు వ్యాయామం, యోగా, ద్యానం లాంటి వ్యసనలు చేయాలని తెలిపారు. అనంతరం మెనూ రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ శంకర్, అశోక్ కుమార్, ఫాతిమా, నిర్మల, అక్షిత, మంగ్త, ఎస్ఓ స్రవంతి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


