నల్లబెల్లి మండలంలో
‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’
కాకతీయ, నల్లబెల్లి: నల్లబెల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పంచాయతీ అధికారి పసర గొండ రవి మాట్లాడుతూ… మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో మార్చి 6 నుంచి మార్చి 15 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, సంస్థాగత నిర్వహణ, రికార్డుల నిర్వహణ, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజూ నిర్వహించాల్సిన కార్యాచరణపై కూడా అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చారు. సమావేశంలో ఏపీఎం సుధాకర్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు


