శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని కేసీఆర్‌కు ఆహ్వానం
– మార్చి 8 నుంచి 19 వరకు నాచారం గుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు
– మాజీ మంత్రి హరీష్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి కూడా ఆహ్వానం
– వేద ఆశీర్వచనం, శేష వస్త్రం, ప్రసాదం అందజేసిన అర్చకులు
కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మార్చి 8 నుంచి 19 వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావలసిందిగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును దేవస్థానం ప్రతినిధులు ఆహ్వానించారు. అలాగే మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు, దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డిని కూడా బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని కోరుతూ ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ బి. రంగాచారి, కార్యనిర్వహణ అధికారి పల్లెర్ల రవీందర్, సహాయకులు సుధాకర్, రిటైర్డ్ ఉప ప్రధాన అర్చకులు కృష్ణమాచార్యులు, పురోహితులు గోపాలకృష్ణ శర్మ, నాగరాజు శర్మలు కలిసి వారికి వేద ఆశీర్వచనం అందించి స్వామివారి శేష వస్త్రం, ప్రసాదం అందజేశారు. బ్రహ్మోత్సవాలను భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు


