కవిత పాదయాత్రలో పాల్గొన్న కొట్టాల యాదగిరి ముదిరాజ్
– అలిపిరి నుంచి తిరుమల వరకు పాదయాత్రగా మొక్కు చెల్లింపు
– కవిత నిర్దోషిగా బయటపడిన సందర్భంగా తిరుమల యాత్ర
– న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్న యాదగిరి ముదిరాజ్
కాకతీయ, గజ్వేల్ : లిక్కర్ కుంభకోణం కేసులో జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత నిర్దోషిగా బయటపడిన నేపథ్యంలో ఆమె అలిపిరి నుంచి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్లారు. ఈ పాదయాత్రలో గజ్వేల్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది, జాగృతి రాష్ట్ర వైస్ చైర్మన్ కొట్టాల యాదగిరి ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొట్టాల యాదగిరి ముదిరాజ్ మాట్లాడుతూ… గతంలో కవిత లిక్కర్ కేసు నుంచి నిర్దోషిగా బయటపడాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నామని తెలిపారు. ఆ మొక్కు నెరవేరడంతో శుక్రవారం అలిపిరి నుంచి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్లి మొక్కు చెల్లించుకున్నట్లు వెల్లడించారు. జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితపై అక్రమ కేసు నమోదు చేసినప్పటికీ చివరకు ధర్మమే గెలిచిందని అన్నారు. ఈ పరిణామంతో కోర్టులపై సామాన్య ప్రజలకు సైతం నమ్మకం మరింత పెరిగిందని కొట్టాల యాదగిరి ముదిరాజ్ పేర్కొన్నారు.


