పరీక్ష సామాగ్రి పంపిణీ
కాకతీయ, ఏటూరునాగారం: మండలంలోని కోయగూడ గ్రామ పంచాయతీలోని 10వ తరగతి విద్యార్థి, విద్యార్థినిలకు గ్రామ సర్పంచ్ పోరిక సరిత, ఎంఈఓ కొయ్యడ మల్లయ్య ఆధ్వర్యంలో 35 మంది విద్యార్థులకి పరీక్ష మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ సరిత మాట్లాడుతూ.. టెన్త్ క్లాస్‌లో మండలం ఫస్ట్ ర్యాంకర్ కు రూ. 5116ల బహుమతి ఇచ్చి తల్లిదండ్రుల సమక్షంలో సన్మానం చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గార గాంధీ, వార్డ్ మెంబెర్ పోదేం రాంబాబు, టీచర్లు వెంకటేష్, అన్వర్, విద్యార్థులు పాల్గొన్నారు.


