నారాయణలో టర్మ్ –2 ఎస్‌ఎల్‌సి
విద్యార్థుల నేతృత్వంలో సమావేశం
కాకతీయ, జనగామ: జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో టర్మ్ – రెండు ఎస్‌ఎల్‌సి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ఈ-కిడ్స్ ఆర్ అండ్ డి సంగీత, జోనల్ డీజీఎం రిజ్వానా ఇమ్రాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంగీత మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు తమ నేతృత్వంలో సమావేశం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ విద్యా పురోగతి, పాఠశాలలో నేర్చుకున్న అంశాలను తల్లిదండ్రులకు వివరించే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఇది విద్యార్థుల మాట్లాడే నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు మంచి వేదికగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం రిజ్వానా ఇమ్రాన్ మాట్లాడుతూ ఎస్‌ఎల్‌సి కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ తరగతి గదులను అలంకరించి, ఏడాది పొడవునా నేర్చుకున్న విషయాలను వివిధ రూపాల్లో ప్రదర్శించే అవకాశం ఉంటుందని అన్నారు. తల్లిదండ్రులతో కలిసి తమ అభ్యాస పురోగతిపై చర్చించడం ద్వారా విద్యార్థుల్లో బాధ్యతాభావం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఫర్హానా, ఈ-కిడ్స్ కోఆర్డినేటర్ శిరీష, ఏఓ చారి, వి.పి శ్రీలేఖ, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


