ఎక్సైజ్ కాలనీలో చైన్ స్నాచింగ్
మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కొని పరారైన దుండగులు
కాకతీయ, హనుమకొండ : హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఎక్సైజ్ కాలనీలో ఈ ఘటన జరిగింది. మామిండ్ల నవ్య అనే మహిళ తన ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా, గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై అక్కడికి వచ్చారు. ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం రంజిత్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.


