అన్నదాన ట్రస్ట్‌కు రూ.2 లక్షల విరాళం
కాకతీయ, సిరిసిల్ల టౌన్: వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం అన్నదాన ట్రస్ట్‌కు హైదరాబాద్ కోకాపేట్‌కు చెందిన బొమ్మ వేణి రాజేశ్వరరెడ్డి–సౌజన్య దంపతులు రూ.2 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈసందర్భంగా అన్నప్రసాదానికి రూ.1,82,000, శాశ్వత అభిషేకానికి రూ.18,000 రూపాయలను సమర్పించారు. ఈ మొత్తాన్ని ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీనివాస్శర్మకు అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబ సభ్యులకు స్వామివారి దర్శనం చేయించి, అర్చకుల చేత ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలను అందజేశారు.


