లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి
చొప్పదండిలో విషాదం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఇద్దరు యువకులు మృతిచెందారు. మండలంలోని రుక్మాపూర్ గ్రామానికి చెందిన చిలుక ప్రదీప్ కుమార్, తాటికొండ సాయి కిరణ్ బైక్‌పై ప్రయాణిస్తుండగా చాకుంట ఎక్స్‌రోడ్డు వద్ద అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం తీవ్రతతో వారి తలలు నుజ్జునుజ్జు అయ్యాయని స్థానికులు తెలిపారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతిచెందడంతో రుక్మాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


