*రాష్ట్రస్థాయి కరాటే క్రీడల్లో జిల్లా పరిషత్ పాఠశాలఏటూరునాగారం విద్యార్థుల ప్రతిభ
*బంగారు పతకం ప్రైజ్ మనీ సాధించిన విద్యార్థులు
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో8వ స్టేట్ లెవెల్ షాన్ ఖాన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి వసంత విశాల్ సాయి, జునగరి రాకేష్ లు బంగారు పతకాలు సాధించారు. రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో జరిగిన పోటీలలో సీనియర్ విభాగంలో విశాల్ సాయి విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ తో పాటు కప్పు మెడల్ మనీ ప్రైస్ సాధించాడు. కాకుండా జూనియర్ విభాగంలో రాకేష్ గోల్డ్ మెడల్ గా సాధించాడు. వీరిని కరాటే మాస్టర్ ఎండి అబ్బు ఎండి. హుస్సేన్ శాలువాలతో సన్మానించారు.
విద్యార్థులను ఎంఈఓ కొయ్యడ మల్లయ్య సన్మానం
గోల్డ్ మెడల్ విశాల్ రాకేష్లను ఎంఈఓ కొయ్యడ మల్లయ్య ప్రధానోపాధ్యాయులు వాసం సాంబశివరావు, పి.ఈ. టి. పద్మశ్రీ, ఉపాధ్యాయులు సుమన్, రాజన్న, నాగరాజు, రమాదేవి , శ్రవణ్ కుమార్, వెంకటరమణ తదితరులు ప్రశంస పత్రాలు ఇచ్చి సన్మానం చేసి విద్యార్థులను అభినందించారు


