అధికారుల సమన్వయంతో కొమ్మాల జాతర విజయవంతం
*గీసుగొండ తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్..
కాకతీయ, గీసుగొండ:అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కొమ్మాల జాతర విజయవంతం అయిందని తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్ అన్నారు. మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభ బండ్ల ర్యాలీ, భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ నిర్వహణపై ముందస్తు ప్రణాళికతో అధికారులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు.జిల్లా కలెక్టర్, వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మార్గదర్శకత్వంలో పోలీసులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజకీయంగా సున్నితంగా భావించే గీసుగొండలో కూడా ఎలాంటి గొడవలు,అల్లర్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. డీసీపీ వరంగల్ రూరల్ అంకిత్ కుమార్,ఆర్డీఓ సుమ, మామునూర్ ఏసీపీ వెంకటేష్, సీఐ విశ్వేశ్వర్, ఎంపీడీఓ కృష్ణవేణి పర్యవేక్షణలో భద్రతా, పరిపాలనా ఏర్పాట్లు సమర్థవంతంగా జరిగాయని తెలిపారు.వరంగల్–నర్సంపేట్ ప్రధాన రహదారిపై వాహనాలను దారి మళ్లించే చర్యలు తీసుకోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తలేదు.ముందుగానే మీడియా ద్వారా ప్రజలకు సమాచారం ఇవ్వడం వల్ల భక్తులకు,ప్రభ బండ్లకు ఎలాంటి ఆటంకాలు కలగలేదని అన్నారు.జాతర నిర్వహణలో స్థానిక రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సహకారం అందించారు.ప్రభ బండ్ల ర్యాలీ ప్రశాంతంగా జరిగేలా తీసుకున్న చర్యలకు నిర్వాహకులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్,రెవెన్యూ శాఖలతో పాటు పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య శాఖ,ఇరిగేషన్, ఆర్ అండ్ బి, ఫైర్,ఆర్టీసీ, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేసి తమ వంతు సేవలు అందించారని తహసిల్దార్ అన్నారు.


