మిలియన్ మార్చ్ విజయవంతం చేయాలి
కాకతీయ, కరీంనగర్ : హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద మార్చి 10న నిర్వహించనున్న మిలియన్ మార్చ్‌ను భారీగా విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట మల్లయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం కరీంనగర్ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకట మల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు, రాజకీయ పార్టీలకు అతీతంగా వివిధ ఉద్యమకారుల సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళా, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కవులు, రచయితలు, కళాకారులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు మార్వాడి సుదర్శన్, నగర అధ్యక్షుడు గోడిశాల రమేష్, కరీంనగర్ జిల్లా ప్రచార కార్యదర్శి వొడ్నాల రాజు, లింగంపల్లి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, చిలుముల మహేందర్, నగర సహాయ కార్యదర్శి గంగిపల్లి సతీష్, నగర కార్యదర్శి పెద్దపల్లి మధుసూదన్, సహాయ కార్యదర్శి తోట రాకేష్, గాజర్ల పెంటయ్య, పల్లె నారాయణ గౌడ్, మహమ్మద్ అజీముద్దీన్, కళ్యాడాపు రేఖా, ఆసియా సుల్తానా, సరస్వతి, సువర్ణ, పల్లె మురళి గౌడ్, మహమ్మద్ అబిద్ అలీ, కరుణాకర్, నర్సింగ్, రోజు సాగర్ తదితరులు పాల్గొన్నారు.


