కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ కదం తొక్కింది. రైతులకు బాసటగా నిలుస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టింది. ధర్నా చేస్తున్న బీఆర్ ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులను హరీశ్ రావు సూటిగా పలు ప్రశ్నలు అడిగారు.
అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను జీతాలు పెరిగాయా..వాహనాల్లో కొట్టిస్తున్న పెట్రోల్ డబ్బులు ఇస్తున్నారా, టీఏ, డీఏలు వచ్చాయా అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రతినెలా ప్రత్యేక అలవెన్స్ ఇస్తున్నారా, మీకు పెట్రోల్ బిల్లులు వస్తున్నాయా ..పంపోడు మీకు ఉద్దెరకు పోస్తలేడు.
పోలీసు జీపులకు పెట్రోల్ పోయించుకునేందుకు రేవంత్ రెడ్డి పైసలు కూడా ఇవ్వడం లేదు. మీ సొంతం పైసలతోటి పెట్రోల్ పోయించుకుంటున్నారు. మీకు పెట్రోల్ కోసం పైసలు వస్తున్నాయా చెప్పండి అంటూ హరీశ్ రావు అడిగారు. హరీశ్ రావు ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేదు. మొత్తానికి హరీశ్ రావును పోలీస్ వ్యాన్ లోకి ఎక్కించారు.
అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను జీతాలు పెరిగాయా?
వాహనాల్లో కొట్టిస్తున్న పెట్రోల్ డబ్బులు ఇస్తున్నారా?
టీఏ, డీఏలు వచ్చాయా అంటూ సమస్యలు అడిగి తెలుసుకున్న హరీష్ రావు https://t.co/2wFy88K4I3 pic.twitter.com/IherHoKxnT
— Telugu Scribe (@TeluguScribe) August 30, 2025


