భద్రత గాల్లో దీపమే..?
ప్రమాదకరంగా రహదారి.. పట్టించుకోని అధికారులు
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మండలం కొత్తపల్లి శివారు వావిలాలవైపు వెళ్లే రోడ్డు ప్రమాదకరంగా మారింది. కాలువ పక్కన ఎలాంటి కల్వర్టు లేకుండా అధికారులు భద్రత విషయాన్ని గాలికి వదిలేశారు.
నిత్యం రద్దీగా ఉండే రోడ్డు, సుల్తానాబాద్, వావిలాల, కుందనపల్లి, పెద్దపల్లి, తనుగుల వైపు వెళ్లే ప్రధాన రహదారి కావడం గమనార్హం. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు వెళ్లే రహదారిపై రోడ్డుకు ఇరువైపున ఎలాంటి భద్రత కల్వర్టు లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు పేర్కొంటున్నారు. వెంటనే ఇరువైపులా కల్వర్టు ఏర్పాటు చేసి సేఫ్టీ ఇండెక్స్ లను పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.


