బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
ఎల్లాయిగూడెం – మాధవ నగర్ మధ్య ప్రమాదం
కాకతీయ, చెన్నారావుపేట: అతివేగం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం – మాధవ నగర్ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరుకు చెందిన పిట్టల అరవింద్ (22) బుధవారం జల్లి గ్రామంలో జరిగిన ఒక శుభకార్యానికి హాజరయ్యాడు. అర్ధరాత్రి ఇంటికి తిరిగి వెళ్తుండగా, మాధవ నగర్ సమీపంలోని మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. అరవింద్ ప్రయాణిస్తున్న బైక్ అతివేగంతో ఉండటంతో మలుపు వద్ద నియంత్రణ కోల్పోయాడు.ఈ ప్రమాదంలో అతడు సమీపంలోని మొక్కజొన్న చేనులో పడిపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని గూడూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


