epaper
Thursday, March 5, 2026
epaper

కొమ్మాల జాతరకి కొత్త కాంతులు

కొమ్మాల జాతరకి కొత్త కాంతులు
నాడు ఎడ్ల బండ్లు… నేడు వాహనాల ర‌ద్దీ
జిగేల్‌మనే విద్యుత్ కాంతులతో ప్రభల శోభ
రాజకీయ సందడితో పెరిగిన ఆకర్షణ..హైటెన్ష‌న్‌
ఏడాదికేడాదికి పెరుగుతున్న భక్తుల రద్దీ
ప్రత్యేక అలంకరణలతో వాహనాల ఊరేగింపులు

కాకతీయ, గీసుగొండ : ఒకప్పుడు ఎద్దుబండ్లు, కోలాటాల సందడితో కనిపించిన కొమ్మాల జాతర ఇప్పుడు విద్యుత్ కాంతుల వెలుగులతో, వాహనాల రద్దీతో కొత్త రూపాన్ని సంతరించుకుంది. సంప్రదాయానికి ఆధునికత జోడై మూడు రోజుల పాటు ఈ జాతర ఉత్సాహంగా సాగుతోంది. ఏడాదికేడాదికి పెరుగుతున్న భక్తుల రద్దీ, రాజకీయ సందడి, కళాకారుల ప్రదర్శనలు జాతరకి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఊరంతా పండుగ వాతావరణంతో కళకళలాడుతోంది. ఒకప్పుడు గ్రామస్తులు కుటుంబ సమేతంగా ఎద్దుబండ్లపై జాతరకు చేరుకునేవారు. ఇప్పుడు కాలం మారడంతో కార్లు, బైకులు, ట్రాక్టర్లు, ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల రద్దీతో కొమ్మాల మార్గాలు కిక్కిరిసిపోతున్నాయి. అయితే కాలం మారినా భక్తి ఉత్సాహం మాత్రం ఏమాత్రం తగ్గలేదని గ్రామస్తులు చెబుతున్నారు.

వెల్లివిరిసిన ప్రభల శోభ

జాతరలో ప్రభలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. రంగురంగుల కాంతులతో తీర్చిదిద్దిన ప్రభలు రాత్రివేళల్లో మరింత అందంగా మెరిసిపోతూ భక్తులను అలరిస్తున్నాయి. ప్రతి వర్గం తమ ప్రభను ప్రత్యేకంగా అలంకరించేందుకు పోటీపడుతుండటం జాతర ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. జాతరలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనడంతో సందడి మరింత పెరిగింది. తమ వర్గాల ప్రభలను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపులో పాల్గొనడంతో హడావుడి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఏడాదికేడాదికి పెరుగుతున్న భక్తుల రద్దీ

ప్రతి సంవత్సరం కొమ్మాల జాతరకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సమీప మండలాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. గత ఏడాది సుమారు ఐదు లక్షల మంది భక్తులు జాతరలో పాల్గొన్నట్లు అంచనా. ఈ ఏడాది కూడా భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. స్థానిక కళాకారుల నృత్య ప్రదర్శనలు, వేషధారణలు, డప్పుల మోత జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రభ బండ్ల ముందు యువతులు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అయితే రికార్డింగ్ నృత్యాలు నిషేధం ఉన్నప్పటికీ కొందరు వర్గాలు నిర్వహించడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభ బండ్లకు ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతులు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారీ కంటైనర్లపై ఏర్పాటు చేసిన లైటింగ్ అలంకరణలు, భారీ తెరలతో కూడిన ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. విద్యుత్ దీపాల ఛత్రిలతో అలంకరించిన ఊరేగింపులు జాతరకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ఇలా సంప్రదాయం, ఆధునికత కలయికతో కొమ్మాల జాతర ప్రతి ఏడాది కొత్త కాంతులతో భక్తులను అలరిస్తూ ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వైభవంగా మల్లికార్జునస్వామి కళ్యాణం

వైభవంగా మల్లికార్జునస్వామి కళ్యాణం కాకతీయ, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లె...

రోడ్డు పనులు పూర్తి చేయాలి

రోడ్డు పనులు పూర్తి చేయాలి కాకతీయ, మరిపెడ : మున్సిపాలిటీ పరిధిలోని కొండ...

పన్నుల చెల్లింపుపై

పన్నుల చెల్లింపుపై వడ్డీ మాఫీ ఉండదు ప్రజలు కార్పొరేషన్‌కు సహకరించాలి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను...

జాతరకు పెద్దఎత్తున రాజకీయ ప్రభలు

జాతరకు పెద్దఎత్తున రాజకీయ ప్రభలు ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి, మాజీ ఎమ్మెల్యే పెద్ది...

తూము మూసివేతపై పోలీసులకు ఫిర్యాదు

తూము మూసివేతపై పోలీసులకు ఫిర్యాదు కాకతీయ, ఇనుగుర్తి: కెనాల్ నుంచి బేరు చెరువు...

ఘ‌నంగా హోలీ

ఘ‌నంగా హోలీ కాకతీయ, మరిపెడ: హోలీ వేడుక‌ల‌ను బుధవారం మండలంలోని వివిధ గ్రామాల్లో...

ర్యాగింగ్ ఘటనపై

ర్యాగింగ్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి కాకతీయ, మరిపెడ : మరిపెడ మండలంలోని...

ప్రగతి ప్రణాళికకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలి

ప్రగతి ప్రణాళికకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలి వ‌రంగ‌ల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద కలెక్టరేట్‌లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img