వైభవంగా మల్లికార్జునస్వామి కళ్యాణం
కాకతీయ, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లె గ్రామంలో బుధవారం మల్లికార్జునస్వామి వార్షిక కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఆలయ నిర్వాహకులు రామడుగు వంశీకులు రామడుగు అచ్యుతరావు దంపతుల ఆధ్వర్యంలో మహోత్సవం వేదమంత్రోచ్చారణల నడుమ వైభవంగా కొనసాగింది. గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్నిదర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. మంగళవాయిద్యాలు, హారతుల వెలుగులు, భక్తిగీతాలతో ఆలయ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. గ్రామ ఐక్యతకు, భక్తి భావనకు ప్రతీకగా నిలిచిన ఈ ఉత్సవం అందరి హృదయాల్లో ఆనందాన్ని నింపింది. ఈ సందర్భంగా రంగురంగుల విద్యుత్ దీపాలు, మామిడి తోరణాలతో ఆలయాన్ని అలంకరించారు



