తూము మూసివేతపై పోలీసులకు ఫిర్యాదు
కాకతీయ, ఇనుగుర్తి: కెనాల్ నుంచి బేరు చెరువు కు వచ్చే తూమును గుర్తు తెలియని వ్యక్తులు మూసివేయడంతో సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ కాలువ నుంచి చెరువుకు వచ్చే నీరు ఆగిపోవడంతో రైతులు స్థానిక సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ కు తెలపడంతో బుధవారం సర్పంచ్ డిబిఎం 48 కెనాల్ తూమును పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కాలువ నుండి చెరువుకు వచ్చే తూమును మూసివేయడం దారుణమని, ఇలాంటి సంఘటనలు జరగకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ కొట్టం రాము, కాంగ్రెస్ జిల్లా నాయకులు చిన్నాల కట్టయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


