కాకతీయ, నారాయణపేట: యూరియా అందక రైతులు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పంటకు సరైన సమయంలో యూరియా అందక పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, అధికారులు వారిపై ఎదురుతిరుగుతున్నారు. రైతుల బాధను పట్టించుకోకపోవడమే కాదు..వారిపై చేయి వేసుకుంటున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను అరిగోస పెడుతున్నారు. పనులు వదులుకుని పడరాని పాట్లు పడుతున్నారు. యూరియా కోసం సొసైటీల వద్ద జాగారం చేస్తున్నారు.
తాజాగా నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో యూరియా అడిగిన రైతును చెంపై కొట్టాడు ఎస్ఐ. ఈ ప్రభుత్వంలో తమకు విలువ లేదని..యూరియా ఇవ్వకుండా తిరిగి తమనే కొడుతున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


