epaper
Wednesday, March 4, 2026
epaper

వివేక్ క‌డుపు మంట‌ ఇప్ప‌టికైనా త‌గ్గిందా?

వివేక్ క‌డుపు మంట‌ ఇప్ప‌టికైనా త‌గ్గిందా?

జైలులో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు

బయటకు రాకుండా అనేక కుట్రలు చేశారు

నా కొడుకు బర్త్ డే నాడు ఇంట్లో లేకుండా చేశారు

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్

కాకతీయ, రామకృష్ణాపూర్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్‌ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ సహా బీఆర్‌ఎస్‌ నాయకులపై పెట్టిన కేసులో జిల్లా సెషన్స్‌ కోర్టు సోమవారం బెయిల్‌ మంజూరుచేయడంతో ఆయన బయటకొచ్చారు. బాల్క సుమన్‌తో పాటు రాజారెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్ బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా క్యాతనపల్లి మున్సిపల్ ఆఫీసుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌ను ఎలా పంపించారని అడిగితే పోలీసులు తమపై లాఠీ చార్జి చేశారని పేర్కొన్నారు. వాళ్లు దాడి చేస్తే.. మాపైనే రివర్స్‌లో కేసు పెట్టారని మండిపడ్డారు. ఈ ఘటనలో 22 మందిపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలిచిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ పీఠం ఎలా వస్తుందని మండిపడ్డారు. ప్రజా తీర్పును మంత్రి వివేక్ గౌరవించడం లేదని విమర్శించారు. జిల్లాలోని కలెక్టర్ నుంచి తహశీల్దార్ వరకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగుల్లా కాకుండా విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో వికృత క్రీడ ప్రారంభించారని బాల్క సుమన్ అన్నారు. జైలు లోపల కూడా తమను ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. నిన్న హోలీ, ఇవాళ నా కొడుకు పుట్టిన రోజు.. ఈ టైమ్‌లో నన్ను ఇంట్లో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎప్పుడూ కక్ష సాధింపు చర్యలకు దిగలేదని తెలిపారు. అందర్నీ కలుపుకుపోయాం తప్ప.. కక్ష సాధింపు చేయలేదని స్పష్టం చేశారు. నన్ను జైలులో పెట్టారు కదా.. ఇప్పుడు కడుపు మంట తగ్గిందని అనుకుంటున్నా అని అన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఇప్పటికైనా సవ్యంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రాజకీయంగానే కేసులు నమోదు చేశారు”

రాజకీయంగానే కేసులు నమోదు చేశారు” -బీఆర్ఎస్ నాయకులు కాకతీయ, రామకృష్ణాపూర్ : రాజకీయంగా ఎదురుకోలేకనే...

కాంగ్రెస్ విష ప్రచారం నమ్మొద్దు

కాంగ్రెస్ విష ప్రచారం నమ్మొద్దు సీపీఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ కాకతీయ, రామకృష్ణాపూర్ :...

“సమస్యలు సత్వరమే పరిష్కరించాలి”

“సమస్యలు సత్వరమే పరిష్కరించాలి” కాకతీయ, రామకృష్ణాపూర్ : గత నాలుగు నెలలుగా పేదలకు...

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అరాచక పాలన

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అరాచక పాలన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాకతీయ, రామకృష్ణాపూర్ :...

బాల్క సుమన్ అరెస్టుతో మంచిర్యాలలో బంద్ – 14 రోజుల రిమాండ్, బీఆర్ఎస్ ఆందోళనలు

బాల్క సుమన్ అరెస్టుతో మంచిర్యాలలో బంద్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు మంత్రి కాన్వాయ్‌పై దాడి...

క్యాతన్‌పల్లిపై బీఆర్ఎస్ జెండా

క్యాతన్‌పల్లిపై బీఆర్ఎస్ జెండా 22 వార్డుల‌కుగాను బీఆర్ఎస్‌కు 10 కాంగ్రెస్ 7, సీపీఐ 4,...

క్యాతన్‌పల్లిలో 71.87 శాతం పోలింగ్ నమోదు

క్యాతన్‌పల్లిలో 71.87 శాతం పోలింగ్ నమోదు కాకతీయ, రామకృష్ణాపూర్ : రెండో విడత...

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం పోలింగ్ కేంద్రాల్లో పూర్తి సౌకర్యాలు భద్రతా చర్యలు పకడ్బందీగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img