epaper
Wednesday, March 4, 2026
epaper

డ్రెనేజీలోనే తాగునీటి పైపులు!

డ్రెనేజీలోనే తాగునీటి పైపులు!

కాశీబుగ్గలో మురికికాల్వ నిర్మాణం అస్తవ్యస్తం

పట్టించుకోని అధికారులు

కాకతీయ, వరంగల్: వరంగల్ మహానగరంలోని కాశీబుగ్గ ఏరియాలో డ్రెనేజీ నిర్మాణం అస్తవ్యస్తంగా చేపడుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఆ పనులు కూడా పూర్తిస్థాయిలో చేపట్టకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అసంపూర్తి నిర్మాణంతో వరద నీటి ముంపు సమస్య ఎలా పరిష్కారమవుతుందని ప్రశ్నిస్తున్నారు. పనులు కూడా నెమ్మదిగా చేపడుతున్నారని, మురికి కాలువలోనే మంచినీటి పైపులైన్ తేలుతుండడం వల్ల ఆందోళన చెందుతున్నారు. పైపు పగిలితే మురికి నీరు లోపలికి వెళ్లకుండా ఉంటుందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అసంపూర్తి నిర్మాణంపై అసహనం..

ఈ కాలనీలో చేపడుతున్న డ్రెయినేజీ నిర్మాణం పూర్తిస్థాయిలో నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు సాగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ కావాలనే పనులు చేస్తున్నాడా? లేదంటే స్థానికులు ఎవరైనా అడ్డుపడుతున్నారా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులంటే ఒక్కరి కోసమో, ఇద్దరి కోసమో చేపట్టరని, ప్రజలందరి క్షేమం కోసం చేపట్టే పనులను అడ్డుకోవడం సరికాదని మండిపడుతున్నారు. అసలు డ్రెయినేజీ నిర్మాణం ఎక్కడి వరకు నిర్మించాలని ఆదేశాలు ఉన్నాయని అడిగినా కాంట్రాక్టర్ చెప్పకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పర్యవేక్షించని అధికారులు!

పనులు మొదలైన నాటి నుంచి వరంగల్ మహానగర పాలక సంస్థకు చెందిన అధికారులు ఎవరూ రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు ఏస్థాయిలో జరుగుతున్నాయో కూడా పట్టించుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు. వర్షాలు భారీగా కురిసినప్పుడల్లా వరద నీటికి కాలనీ మొత్తం నీట మునుగుతున్న విషయం తెలిసీ కూడా డ్రెయినేజీ నిర్మాణం పకడ్బందీగా చేపట్టకపోవడం పట్ల అధికారులను నిలదీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, పనుల తీరును పరిశీలించి, పూర్తిస్థాయిలో నిర్మాణం జరిగేలా చూడాలని కోరుతున్నారు.

ఎవరైనా అడ్డుకుంటున్నారా? కాంట్రాక్టరే నిర్లక్ష్యం చేస్తున్నారా?

అసలు ఈ పనులు పూర్తిస్థాయిలో జరగకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా? లేదంటే కాంట్రాక్టరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? అంటూ స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై బల్దియా అధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అదే క్రమంలో పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకి కొత్త కాంతులు

కొమ్మాల జాతరకి కొత్త కాంతులు నాడు ఎడ్ల బండ్లు… నేడు వాహనాల ర‌ద్దీ జిగేల్‌మనే...

వైభవంగా మల్లికార్జునస్వామి కళ్యాణం

వైభవంగా మల్లికార్జునస్వామి కళ్యాణం కాకతీయ, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లె...

రోడ్డు పనులు పూర్తి చేయాలి

రోడ్డు పనులు పూర్తి చేయాలి కాకతీయ, మరిపెడ : మున్సిపాలిటీ పరిధిలోని కొండ...

పన్నుల చెల్లింపుపై

పన్నుల చెల్లింపుపై వడ్డీ మాఫీ ఉండదు ప్రజలు కార్పొరేషన్‌కు సహకరించాలి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను...

జాతరకు పెద్దఎత్తున రాజకీయ ప్రభలు

జాతరకు పెద్దఎత్తున రాజకీయ ప్రభలు ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి, మాజీ ఎమ్మెల్యే పెద్ది...

తూము మూసివేతపై పోలీసులకు ఫిర్యాదు

తూము మూసివేతపై పోలీసులకు ఫిర్యాదు కాకతీయ, ఇనుగుర్తి: కెనాల్ నుంచి బేరు చెరువు...

ఘ‌నంగా హోలీ

ఘ‌నంగా హోలీ కాకతీయ, మరిపెడ: హోలీ వేడుక‌ల‌ను బుధవారం మండలంలోని వివిధ గ్రామాల్లో...

ర్యాగింగ్ ఘటనపై

ర్యాగింగ్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి కాకతీయ, మరిపెడ : మరిపెడ మండలంలోని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img