కొమ్మాల జాతరకు బీజేపీ ప్రభ బండ్లు
కాకతీయ, నర్సంపేట టౌన్: నర్సంపేట పట్టణంలో కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన ప్రభ బండిని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర ప్రాంత ప్రజల విశ్వాసానికి ప్రతీక అన్నారు.
బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. నర్సంపేట పట్టణంలో ప్రభ బండి ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు సేవ చేయడం తమ భాగ్యంగా భావిస్తున్నామని తెలిపారు. జాతరలో భాగంగా భక్తులకు తాగునీరు, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు, మండల నాయకులు, యువమోర్చా, మహిళా మోర్చా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


