గ్రీన్ సిటీగా మారుస్తా
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపల్ చైర్మన్‌గా మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ఎన్నికైన తర్వాత మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్ అధ్యర్యంలో జమ్మికుంట మున్సిపల్ కార్యాలయ సమీప పార్క్ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటడం జరిగింది. కార్యక్రమం ఉద్దేశించి చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) మాట్లాడుతూ.. నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని అనేక మొక్కలు నాటడం ప్రస్తుత కాలుష్య ప్రపంచంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం అనేది గొప్ప విషయం అన్నారు. రానున్న ఐదు సంవత్సరాల కాలంలో విడతలవారిగా మొక్కలు నాటి ఈ కార్యక్రమం మరింత విజయవంతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వేణురావు, చెప్యాల రాజేశ్వరరావు, జక్కే ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.


