మైనర్‌కు వాహనం ఇచ్చిన వ్యక్తిపై కేసు
కాకతీయ, చింతకాని : మండలంలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదం నేపథ్యంలో మైనర్‌కు వాహనం ఇచ్చిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల ఒకటో తేదీన జరిగిన రెండు ట్రాక్టర్ల ఢీకొన్న ప్రమాదంలో బోనకల్ మండలం గార్లపాడు గ్రామానికి చెందిన శ్రీరామ నాగయ్య మృతి చెందాడు. మొదట మృతుడి తల్లి శ్రీరామ పుల్లమ్మ ఇచ్చిన ఆధార్ ఆధారంగా అతనికి పందొమ్మిదేళ్లు ఉన్నట్లు ఫిర్యాదు నమోదు చేశారు. అయితే తరువాత పోలీసులు చేసిన విచారణలో పదో తరగతి మెమోలో అతనికి పదహారేళ్లు మాత్రమే ఉన్నట్లు బయటపడింది. దీంతో మృతుడిని మైనర్‌గా గుర్తించి, అతనికి వాహనం ఇచ్చిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు ఘటనపై మరింత విచారణ కొనసాగిస్తున్నారు.


