కాకతీయ, బయ్యారం : బయ్యారం మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో తహసీల్దార్ అధ్యక్షతన మండల అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య పాల్గొని పదమూడు కల్యాణలక్ష్మి, ముప్పై మూడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి మండలంలో ఇప్పటివరకు 222 కల్యాణ లక్ష్మి చెక్కులను మంజూరు చేశామన్నరు. ఈ మేరకు రెండు కోట్ల 22 లక్షల 25 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
యూరియా పంపిణీలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్షత చూపుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బయ్యారం ఎంపీడీఓ విజయ లక్ష్మి,మూల మధుకర్ రెడ్డి, తిరుమల ప్రభాకర్ రెడ్డి, వేల్పుల శ్రీనివాస్, భూక్య ప్రవీణ్ నాయక్, తమ్మిశెట్టి వెంకటపతి, సూరం సుధాకర్ రెడ్డి,ఏనుగుల రాకేష్, చెరుకుపల్లి నరసయ్య, నాగరాజు, గట్ల గణేష్, చల్లా సురేష్, తొట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


