క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ..
అనిల్ కుంబ్లే భావోద్వేగమైన పోస్టు..!
కాకతీయ, స్పోర్ట్స్ : క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది. కానీ దానికి పూర్తిగా అంకితమవ్వాలంటే, జీవితం అంతా ఆట చుట్టూ తిరగకూడదని నేర్చుకున్నాను. కొన్నిసార్లు ఆటకు దూరంగా ఉండే క్షణాలే మనల్ని మరింత బలంగా తిరిగి తీసుకొస్తాయి.నా జీవితంలో ఆ ప్రదేశం — అడవి. 1992లో దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో ఇతలా రిజర్వ్ ఫారెస్ట్ సందర్శన నాకు మరచిపోలేని అనుభవం. ఆ సైలెన్స్, ఆ ప్రకృతి నిశ్శబ్దం నా మనసులో గాఢ ముద్ర వేసింది. ప్రధాన వృత్తిలో తాజాదనం నిలబెట్టుకోవాలంటే, మరో రంగంలో “శిష్యుడు” కావాలని నేను నమ్ముతాను. నాకు అది కెమెరా. దక్షిణాఫ్రికాలోని రిజర్వ్‌లు గానీ, సహజావాసంలో విహరించే పులులను గమనించడం గానీ—అడవిలో గడిపే ఆ క్షణాలు నాకు కొత్త దృష్టికోణం ఇస్తాయి. ఈ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా, ప్రకృతితోనైనా, మీతోనైనా మళ్లీ కలిసేలా చేసే ఒక ఆసక్తిని ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని నేను కోరుతున్నాను. కొన్నిసార్లు కొంచెం దూరం కావడమే, మరింత స్పష్టతతో తిరిగి రావడానికి సహాయపడుతుంది. అంటూ సోషల్‌మీడియా వేదికగా భారత లెజండరీ స్పిన్ మాంత్రికుడు, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా దక్షిణాఫ్రికా అడవుల పర్యటనలో తాను తీసిన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.



