నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి సప్తవర్ణ అభిషేకం..
స్వామివారికి హోలీ ప్రత్యేక పూజలు..
కాకతీయ,గీసుగొండ: ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి సప్తవర్ణ అభిషేకం నిర్వహించారు. మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలో కొలువుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో హోలీ పౌర్ణిమను పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శన చార్యులు స్వామివారికి వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా సప్తవర్ణ అభిషేకం నిర్వహించారు.హోలీ పర్వదినం సందర్భంగా ప్రత్యేక అర్చనలు, మహామంగళహారతులు సమర్పించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో అలంకరించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ, చందనం తదితర పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేయగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. అనంతరం 10 గంటలకు చంద్రగ్రహణం మొదలవడంతో ఆలయ తలుపులు మూసివేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఉప అర్చకులు శ్రీహర్ష,ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు,కోశాధికారి కొత్తగట్టు రాజేందర్,ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



