epaper
Saturday, November 15, 2025
epaper

తెలంగాణపై కేంద్రం చిన్నచూపు: పెద్ద‌ప‌ల్లి ఎంపీ గ‌డ్డం వంశీకృష్ణ‌

కాక‌తీయ‌, గోదావ‌రిఖ : తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చిన్న చూపు చూస్తుంద‌ని పెద్ద‌ప‌ల్లి ఎంపీ గ‌డ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్ద‌ప‌ల్లి జిల్లా గోదావ‌రిఖని ప‌ట్ట‌ణ కేంద్రంలోని ప్రెస్ క్ల‌బ్‌లో ఏంపీ గ‌డ్డం వంశీ కృష్ణ శుక్ర‌వారం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా అయ‌న మాట్ల‌డుతూ.. తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై పార్లమెంటులో ప్రస్తావించడం జరిగిందని, తెలంగాణకు వచ్చే కోటాను పూర్తిస్థాయిలో అందించాలని కేంద్ర మంత్రులకు వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు.

తొమ్మిది లక్షల టన్నుల యూరియాకు గాను నాలుగున్నర లక్షల టన్నులను మాత్రమే ఇచ్చారని, విదేశాల నుండి రావలసిన 30 లక్షల టన్నుల యూరియా రాలేదని మంత్రులు తెలిపారన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న చర్యల మూలంగా విదేశాల నుండి యూరియా రావడం లేద‌ని, తెలంగాణకు 50 వేల టన్నుల యూరియాను అందిస్తామని న‌డ్డా ఒప్పుకున్నారని తెలిపారు. వచ్చే వారం పది రోజుల్లో 25 వేల టన్నుల యూరియాను రాష్ట్రానికి అందించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

రామగుండం ఎరువుల కర్మకారాన్ని సందర్శించి కర్మాకారంలో ఏర్పడిన లోపాలను తెలుసుకోవడం జరిగింద‌ని, అందులో తలెత్తిన లోపాలను సవరించి ఉత్పత్తి దశలోకి తీసుకురావాలని ఆదేశాలు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్లాంట్ లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని కేంద్ర మంత్రులకు వివరించామని, దేశ ప్రధాని గ్రౌండ్ లెవల్ లోకి వచ్చి ఫ్యాక్టరీలో జరిగే లోపాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. అంతే కాకుండా బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల‌న్నారు.

రామగుండం విమానాశ్రయంపై ఇప్పటికే కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చామని, ఆంధ్రప్రదేశ్ కు ఎనిమిది నుంచి పది విమానాశ్రయాలు ఉంటే తెలంగాణలో మాత్రం ఒకే ఒక్క‌ విమానాశ్రయం ఉందని తెలిపామన్నారు. రామగుండం ప్రజల చిరకాల కోరిక నెరవేర్చేందుకు చర్యలు చేపడుతున్న‌ట్లుగా ఆయ‌న తెలిపారు.

రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలని పార్లమెంటులో ప్రస్తావించడం జరిగింద‌ని త్వరితగతిన టెండర్ ప్రక్రియ పూర్తిచేసి ఆసుపత్రిని నెలకొల్పాలని కోరామని తెలిపారు. పాలకుర్తి మండలం కన్నాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కేంద్ర మంత్రులను రైల్వే అధికారులను కలిశామ‌ని, రూ.80 కోట్ల నిధులతో నిర్మాణానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింద‌న్నారు. త్వ‌ర‌లో ప‌నులు ప్రారంభించి ప్ర‌జా ర‌వాణా మెరుగుప‌డేలా చ‌ర్య‌లు చేప‌డతామని ఎంపీ అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరుగుతున్న రహదారి...

17 వ మహాసభ జయప్రదం చేయాలి

17 వ మహాసభ జయప్రదం చేయాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : మందమర్రిలో ఈ...

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : ఓపెన్ కాస్ట్ ఫేజ్...

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప...

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్..

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్.. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ బంపర్ "వి"క్టరీ.. సోమాజిగూడ...

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల రఘునాథపాలెం మండలంలో పొలాలు సందర్శించిన మంత్రి...

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌ రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నిర్వహణ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img