రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు
కాకతీయ, కొత్తగూడెం రూరల్: రాహుల్ గాంధీ ని మర్యాద పూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ళ మురళి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ తదితరులు విపక్ష నేత రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు.వికారాబాద్ సమీపంలోని అనంతగిరి హిల్స్ లో గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన విపక్ష నేత, రాహుల్ గాంధీ ని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచనల మేరకు డీసీసీ అధ్యక్షురాలతో మర్యాద పూర్వకంగా కలిసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ళ మురళి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ తదితరులు ఉన్నారు.


