రాహుల్ గాంధీతో ఇనుగాల దంపతుల భేటీ
గాంధీ కుటుంబానికి సంబంధించిన పెయిటింగ్ను జ్ఞాపికగా అందజేత
కాకతీయ, తెలంగాణ బ్యూరో : వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో గత పది రోజులుగా కొనసాగిన తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల రాజకీయ శిక్షణ తరగతులు సోమవారం ఘనంగా ముగిశాయి. “సంఘటన్ సృజన్ అభియాన్” పేరిట ఫిబ్రవరి 21న ప్రారంభమైన ఈ శిబిరం మార్చి 2న ముగింపు సమావేశంతో ముగిసింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరై డీసీసీ అధ్యక్షులకు మార్గదర్శనం చేశారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తన సతీమణి అవంతి రెడ్డి రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. గాంధీ కుటుంబానికి సంబంధించిన అరుదైన పెయింటింగ్ జ్ఞాపికను ఆయనకు అందజేశారు. ఈ ముగింపు కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్, రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు 75 మంది డీసీసీ అధ్యక్షులు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొని సంస్థాగత బలోపేతంపై అవగాహన పొందారు.



