కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ నగరంలో గతవారం జరిగిన వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలల్లో ఘన విజయం సాధించిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు ను మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ వరంగల్ లో తిరుగులేని వ్యక్తి ఎర్రబెల్లి ప్రదీప్ రావ్ అన్నారు. ఆయన భవిష్యత్తులో అనేక విజయాలు సాధించి, వరంగల్ వాసులకు భారతీయ జనతా పార్టీ తరపున మరిన్ని సేవలు అందించాలని కోరారు.


