ఉద్యమకారుడి మృతికి నాగూర్ల ఘన నివాళి
శాయంపేట హవేలీ గ్రామంలో విషాదం
రాజబోయిన రాము పార్థివ దేహానికి పూలమాల
కుటుంబానికి అండగా ఉంటానని హామీ
కాకతీయ, గీసుగొండ : తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారుడు, శాయంపేట హవేలీ గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ రాజబోయిన రాము అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఆయన పార్థివ దేహానికి రాష్ట్ర రైతు రుణ విమోచన కమిటీ మాజీ ఛైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాము కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాముకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారని తెలిపారు. పరకాల నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు, ప్రతి ఉద్యమకారుడికి ఏ కష్టం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని, ఎవ్వరూ అధైర్యపడవద్దని నాగూర్ల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ధర్మారావు, మాజీ ఎంపీపీ ముంత కలావతి రాజయ్య, ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల అధ్యక్షుడు సందేల సునిల్, రూరల్ జిల్లా అధ్యక్షుడు ఎనుమాముల, మాజీ కమిటీ డైరెక్టర్లు గుర్రం రఘు, గోలి రాజయ్య, మాజీ డీసీసీ సభ్యుడు దొంగల రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొంగర రవి, మాజీ కార్పొరేటర్ ల్యాదెళ్ల బాలు, ఉద్యమకారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


