కాకతీయ, మంథని : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ప్రభుత్వానికి శక్తిని ప్రసాదించాలని ఆ మహాగణపతిని కోరుకున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు తెలిపారు. శుక్రవారం మంథనిలోని రావుల చెరువు కట్ట వద్ద గల గణేష్ మండపంలో నిర్వహించిన హోమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి పథకాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా దుష్ట శక్తులను తరిమేసి ప్రభుత్వాన్ని ముందుగా నడిపే విధంగా చూడాలని భగవంతున్ని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో అనుకోకుండా భారీ వర్షాలు కురవడం వల్ల ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లిందని, అదేవిధంగా పంట పొలాల్లో నీరు చేరి రైతాంగం నష్టపోయిందని, నష్టపోయిన ప్రతీ రైతును ప్రభుత్వ పరంగా పరిహారం చెల్లించి ఆదుకుంటామని మంత్రి తెలిపారు.


