కాకతీయ, పెద్దపల్లి : మహిళల రక్షణ కోసం ప్రతి రోజు బస్టాండ్, ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో, కాలేజీల వద్ద షీ టీం నిరంతరం ఉంచడం జరుగుతుందని షీ టీం సభ్యులు స్నేహలత అన్నారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు శుక్రవారం పెద్దపల్లి మండలం రంగంపల్లి గ్రామ మైనార్టీ పాఠశాలలో విద్యార్దులకు షీ టీం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీం సభ్యులు స్నేహలత విద్యార్థులతో మాట్లాడారు. మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, చెడుగా ఎవరైన మాట్లాడినా, ప్రవర్తించినా వెంటనే తల్లి తండ్రులకు తెలపాలని, అలాగే అటువంటి సమయంలో ఏ విధంగా బయటపడాలి అనే అంశం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎవరైనా వేధింపులకు గురిచేస్తే మహిళలు, విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్ కు ఫోన్ చేసి సమస్య తెలపాలని, ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని హేమలత స్పష్టం చేశారు.
అత్యాశకు పోయి సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు, లోన్ యాప్స్ గురవుతున్నారని అటువంటి వాటి జోలికి పోకుండా ఉండాలని, ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయిన, బెదిరింపులకు గురైతే వెంటనే 100 నంబర్ కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు మౌనిక, సురేష్, హెడ్ మాస్టర్ భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


