epaper
Monday, March 2, 2026
epaper

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!
రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్
డీఎస్పీగా శ్రీనివాసులు నియామకం
బదిలీ వెనుక కారణాలపై ఊహాగానాలు

కాకతీయ, రాజన్న సిరిసిల్ల : వేములవాడ సబ్‌డివిజన్ ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న యువ ఐపీఎస్ అధికారి రుత్విక్ సాయి కొట్టేను ఆకస్మికంగా బదిలీ చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. బాధ్యతలు చేపట్టిన రెండు నెలల వ్యవధిలోనే ఆయనకు బదిలీ ఉత్తర్వులు రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన స్థానంలో హైదరాబాద్‌లో ఏసీపీగా పనిచేస్తున్న శ్రీనివాసులను వేములవాడ డీఎస్పీగా నియమిస్తూ డీజీపీ శివధర్ రెడ్డి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇది సాధారణ పరిపాలనా మార్పు మాత్రమేనని పోలీసు వర్గాలు పేర్కొంటున్నప్పటికీ, బదిలీ వెనుక ఇతర కారణాలు ఉన్నాయన్న చర్చలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ప్రజల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఈ మార్పు చర్చనీయాంశంగా మారింది.

అక్రమ మద్యం దందాపై కఠిన చర్యలే కారణమా?

ఇటీవల మున్సిపల్ ఎన్నికల సమయంలో పట్టణంలో కొనసాగుతున్న అక్రమ మద్యం వ్యాపారంపై రుత్విక్ సాయి కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో మద్యం స్వాధీనం చేసుకోవడం, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై దాడులు నిర్వహించడం వంటి చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టప్రకారం వ్యవహరించడం వల్ల కొంతమంది ప్రభావశీల వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు స్థానికంగా ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన బదిలీకి కారణాలు ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రుత్విక్ సాయిని ఉట్నూర్ ఏఎస్పీగా బదిలీ చేసినట్లు సమాచారం.

క్రమశిక్షణాధికారికి బదిలీ వేటా?

అక్రమాలు, అవినీతి అంశాలపై కఠినంగా వ్యవహరించిన అధికారికి తక్షణ బదిలీ అవసరమా అనే ప్రశ్నలు స్థానికంగా తలెత్తుతున్నాయి. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవడం సహజమే అయినా, క్రమశిక్షణతో పనిచేస్తున్న అధికారిపై ఇంత త్వరగా బదిలీ ఉత్తర్వులు జారీ కావడం వెనుక అసలు కారణాలేమిటన్నది ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఈ బదిలీ పూర్తిగా పరిపాలనా నిర్ణయమా? లేక ఇతర ఒత్తిళ్ల ఫలితమా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది. అధికారిక వర్గాల నుంచి పూర్తి వివరణ వెలువడాల్సి ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి ఏసీపీ విజయ్ కుమార్ గంగాధర పోలీస్ స్టేషన్ తనిఖీ కాక‌తీయ‌,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img