కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..
*ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్ పిలుపు
కాకతీయ, గీసుగొండ: ఈ నెల 3వ తేదీ నుండి ప్రారంభం కానున్న కొమ్మాల జాతరను ఘనంగా, శాంతియుతంగా నిర్వహించి విజయవంతం చేయాలని మండల ప్రజలకు ముదిరాజ్ మహాసభ సంఘం మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్ పిలుపునిచ్చారు. జాతర సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివస్తారని, అందువల్ల ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.గ్రామస్తులు, యువత,సంఘ నాయకులు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీటి, పారిశుధ్య,రవాణా వంటి ఏర్పాట్లలో సహకరించాలని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ సాంప్రదాయ ప్రభ బండ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు సజావుగా జరిగేలా ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని కొత్తగట్టు రాజేందర్ పేర్కొన్నారు.


