కాకతీయ, వరంగల్: రాష్ట్రంలో రైతన్నలు రోడ్డు బాట పట్టారు. వర్షాకాలం వచ్చి నెల రోజులు గడుస్తున్నా దుక్కి దున్నేందుకు పడరానిపాట్లు పడాల్సి వస్తోంది. పంట పండించేందుకు సిద్ధంగా ఉన్నా అందుకు యూరియా లేకపోవడంతో ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పొద్దున్నే లేచి యూరియా కోసం గ్రామ సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
అయితే వరంగల్ జిల్లా చింత నెక్కొండ గ్రామంలో ఓ రైతు యూరియా లభించకపోవడంతో చేసేది ఏమీ లేక పత్తిపంటను పీకేసాడు. పంటకు సరైన సమయంలో యూరియా వేయకుంటే పంట దిగుబడి రాదు. ఇటు ఎన్ని రోజుల నుంచి యూరియా కోసం ఎదురుచూసిన ఎలాంటి లాభం లేకుండా పోయింది. దీంతో కడుపుమండిన ఆ రైతన్న తన పంటను పీకేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
fw


