కాకతీయ, జనగామ: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై కుమార్ గౌడ్ గారు క్రీడాకారులు, క్రీడాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతిని ‘జాతీయ క్రీడా దినోత్సవం’గా జరుపుకోవడం గర్వకారణమన్నారు.
“నా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం నా కర్తవ్యం” అన్న ధ్యాన్ చంద్ గారి మాటల స్ఫూర్తితో తెలంగాణ ప్రజా ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొయ్యడ మల్లేష్, మండల Ex MPTC మల్కాపురం లక్ష్మయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కౌడగాని మోహన్ రావు, మరియు మినుముల వెంకట్ రెడ్డి జాతీయస్తాయి వాలీబాల్ క్రీడాకారుడు, జనగామ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి మర్కాల యాదిరెడ్డి, ,టినికైడ్ అసోసియేషన్ జనగామ జిల్లా అధ్యక్షులు ముసిపట్ల విజయ్, కోళ్ల శ్రీను,నూనెముంతలా యాకస్వామి, మినుముల శ్రీనివాస్ రెడ్డి, ముప్పిడి సాంబ,మరకాల మహేందర్ రెడ్డి, దుబ్బాక హరీష్,ఎడ్ల బాలరాజు,బాల్నే పర్శరామ్,కోళ్ల రాజు గౌడ్,రంగు శ్రీనివాస్, సందీప్ రెడ్డి, తిరుమల రెడ్డి, రసమల్ల మలేష్, శాగా శ్రీనివాస్,గోన్నే మల్లారెడ్డి,మహ్మద్ షాబీర్, కబ్బడి క్రీడాకారులు కుమార్, ప్రభాస్, సాంబాశివుడు తదితరులు పాల్గొన్నారు


